AKP: మాడుగులలో జూన్ 2న జరిగే మోదకొండమ్మ జాతర సందర్భంగా అమ్మవారి మాలాధారణ చేసిన భక్తులు ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. మోదకొండమ్మ శతకం పట్టు ప్రాంతం నుంచి పాడేరు సమీపంలోని అమ్మవారి పాదాల వరకు “జై మాతా జై జై మాతా” నినాదాలతో పాదయాత్రగా వెళ్లారు. అనంతరం అమ్మవారి పాదాలు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.