PPM: గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడిలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి పండుగ మహోత్సవాల్లో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఎల్లప్పుడూ వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.