కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామపంచాయతీ పరిధిలో వీధి లైట్లు చెడిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీధి లైట్ల మరమ్మత్తు పనులను శనివారం చేపట్టారు. గ్రామ పంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో పాడైన లైట్లను వెంటనే మరమ్మతులు చేశారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలు, బస్తీలలో లైట్లు సరిచేయడంతో మళ్లీ వెలుగులు నింపారు.