KRNL: ఆదోని పట్టణంలోని దేవినగర్ ప్రాంతంలో ఆదివారం శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ బాల భాస్కర్ మల్లప్ప పాల్గొని సుమారు 100 కుటుంబాలకు చట్టాలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. ఫోక్సో చట్టం, బాల్యవివాహాల నిషేధం, వరకట్న వేధింపులు, ఈవ్‌టీజింగ్ వంటి నేరాలపై చట్టపరమైన చర్యలను వివరించారు.