అనంతపురం జిల్లాలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన నిపుణుల కమిటీలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కమిటీ నుంచి కలెక్టర్, రెవెన్యూ, సర్వే, గనుల శాఖ జిల్లా స్థాయి అధికారులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తాజాగా ఉత్తర్వులు (జీఓ193) జారీ చేశారు.