CTR: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 9 మందికి కోర్టు జరిమానా విధించిందని ట్రాఫిక్ సీఐ లక్ష్మీ నారాయణ మంగళవారం తెలిపారు. పలు ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించి 9 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్టు గుర్తించామన్నారు. వారిని కోర్టులో హాజరు పరచగా ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 90 వేలు జరిమానాను జడ్జి విధించినట్లు ఆయన పేర్కొన్నారు.