PLD: గత ఐదేళ్లూ అమరావతిపై జగన్ విషం చిమ్మినందుకే ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారనీ శుక్రవారం వినుకొండ MLA జీవీ ఆంజనేయులు విమర్శించారు. రాజధాని మళ్లీ జీవకళ సంతరించుకోవడం చూసి ఓర్వలేక జగన్ కొత్త కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే జగన్కు మింగుడుపడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు.