కృష్ణా: శేరిదగ్గుమిల్లి అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ పిల్లలు తగ్గిపోతున్నారని, ఈ కారణంతో అంగన్వాడీ సెంటర్లను పాఠశాలల్లో విలీనం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అంగన్వాడీ టీచర్స్ శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలీన ప్రక్రియను ఆపాలని వారు కోరారు. ప్రీస్కూల్ పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలన్నారు. మెనూ క్వాలిటీ పెంచాలని, యూనిఫామ్, బెల్ట్, బూట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.