చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కార్యాలయంలో అధికారులు శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇందులో మున్సిపల్ డిఈ రమణ, హౌసింగ్ డీఈ శ్రీధర్ ప్రజల నుంచి వినతలు స్వీకరించారు. ఈ మేరకు సమస్యలపై 11 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.