KDP: మైదుకూరు పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్ పెట్రోల్ బంక్ వెనుక నూతన ఎస్ఆర్ సూపర్ మార్ట్‌ను మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపర్ మార్కెట్ వారు వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దాసరి బాబు,మార్కెట్ యార్డ్ ఛైర్మన్, టీడీపీ నేతలు పాల్గొన్నారు.