SKLM శ్రీకాకుళం ఆర్టీసీ-2 డిపో ముందు ఆదివారం ఉదయం AITUC జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఔట్సోర్సింగ్ కార్మికుడు దాసరి కిరణ్‌ను ఎటువంటి నోటీసు లేకుండా విధుల నుండి తొలగించడం అన్యాయమని ఆందోళనకారులు విమర్శించారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని AITUC జిల్లా కౌన్సిల్ సభ్యుడు టి.తిరుపతిరావు డిమాండ్ చేశారు.