కడప: వేంపల్లి మండలం ఇడుపులపాయ గ్రామంలోని YSR ఘాట్ వద్ద మాజీ సీఎం జగన్ మంగళవారం ఉదయం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సమాధి వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. అక్కడే వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.