సత్యసాయి: పెనుకొండ ఐముక్తేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి సవిత, అనంతరం త్రివేంద్ర నాయుడు, కన్నా స్వాములు నిర్వహించిన శివమాల మహోత్సవంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి దేవాదాయశాఖ రూ.5.27 కోట్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపింది. ఇందులో ఐముక్తేశ్వర ఆలయానికి రూ.3.06 కోట్లు మరియు ఇతర ఆలయాలకు నిధులు ఆమోదించినట్లు వెల్లడించారు.