కృష్ణ: జగ్గయ్యపేట మండలం బూదవాడ, రెడ్డినాయక్ తండా గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు రాజీనామా చేసి జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను సమక్షంలో శనివారం జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీని బలోపేతానికి కృషి చేయాలని కోరారు.