BPT: జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 5న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ‘మెగా పేరెంట్స్ మీటింగ్’ జరగనుంది. దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు ఇద్దరూ తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం ఆదేశించారు. పాఠశాల అభివృద్ధిలో సమాజాన్ని భాగస్వామ్యం చేయడమే దీని లక్ష్యం. ఇందులో ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్ సామగ్రిని ప్రదర్శిస్తారు.