E.G: అనపర్తి మండలం రామవరంలో అనపర్తి నియోజకవర్గ కూటమి కార్యక్రమాల కోఆర్డినేటర్ సలాది నాగ సుబ్రమణ్యం జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి, గౌరు జనార్దన్ రెడ్డి, సలాది నాగ సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.