ప్రకాశం: సంతనూతలపాడు మండలం మంగమూరులో ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం ద్వారా నిర్మించిన గృహాన్ని ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. అనంతరం లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలియజేశారు.