CTR: గ్రామాల్లో కుష్ఠు వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు డాక్టర్ పవన్ తెలిపారు. కుష్ఠు వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం చౌడేపల్లి మండలం దాదేపల్లిలో పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వ్యాధిని ఆరంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని తెలిపారు.