BPT: అమృతలూరు మండల ప్రజల సమస్యల పరిష్కారం కోసం, శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ సమస్యలపై వినతి పత్రాలు అందించాలని ఆయన కోరారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్నారు.