ASR: చింతూరులో సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ‘సివిక్ యాక్షన్ ప్రోగ్రాం’ నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని 25 మంది నిరుద్యోగ యువకులకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి ఎల్‌ఎల్‌ఆర్‌లు అందజేశారు. యువత డ్రైవింగ్‌లో ప్రావీణ్యం సంపాదించి సమాజానికి ఉపయోగపడాలని ముఖ్య అతిథి సీఐ గోపాలకృష్ణ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్ ధరమ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.