W.G: మొగల్తూరు మండలం జెట్టిపాలెంలో వేంచేసియున్న శ్రీ పైడిమారెమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 24 నుంచి 28 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు గండర దీపారాధన నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అమ్మవారి జాతర, పురవీధుల్లో వైభవంగా ఊరేగింపు, సాయంత్రం 6 గంటలకు భక్తుల నిప్పులగుండం కార్యక్రమం ఉంటుందన్నారు.