కృష్ణా: ఈ నెల 8, 9,10 తేదీల్లో విజయనగరంలో అండర్-19 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఘనంగా జరిగాయి. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని తృతీయ సాధించారు. ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులలో రాకేష్ లక్ష్మీధర్ జనవరి నెలలో జబల్ పూర్, మధ్యప్రదేశ్లో జరిగే జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొంటారని స్టేడియం కమిటీ బుధవారం తెలిపింది.