NDL: బండి ఆత్మకూరు మండలం ఈర్ణపాడులోని శ్రీ ఈశ్వర, చెన్నకేశవ, కోదండరామస్వామి ఆలయ భూముల కౌలుకు సోమవారం ఉ.10గంటలకు వేలం వేయనున్నట్లు ఈవో నాగప్రసాద్ తెలిపారు. అటు, బి.కోడూరులోని చెన్నకేశవ స్వామి ఆలయ భూములకు సాయంత్రం 4 గంటలకు వేలంపాట నిర్వహిస్తామన్నారు. వేలంలో పాల్గొనే వారు రూ.1,000 డిపాజిట్ చెల్లించి, నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు.