ప్రకాశం: కనిగిరిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను DEO కిరణ్ కుమార్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజన పథకా మెనూ పరిశీలించి, స్వయంగా భోజనం చేసారు. 10వ తరగతి విద్యార్థుల స్టడీ క్లాసులను, 7,9 తరగతుల విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ పరిశీలించారు. తరగతుల నిర్వహణ పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.