VZM: మెంటాడ మండలం ఆండ్ర జడ్పీ హైస్కూల్లో టెన్త్ విద్యార్థి కిలారి రామ్ చరణ్ ఇవాళ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. రామ్ చరణ్ అడుకుంటూ పాఠశాల పైభాగానికి వెళ్లి అక్కడ ఉన్న KV విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురైయాడు. గాయపడిన విద్యార్థిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు హుటాహుటిన గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు.