ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత పురుషులకు సెల్‌ఫోన్ రిపేర్తోపాటు సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు రూడ్సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 18 వరకు 30రోజులపాటు ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 19-50 ఏళ్లలోపు వయసున్నవారు వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలి. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామన్నారు.