KDP: మైదుకూరులో ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల వద్ద ప్రతి ఆదివారం మాంసం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రహదారులపై, చెత్త కుండీలు, మురికి కాలువల పక్కన ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ అమ్మకాలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.