CTR: శాంతిపురం మండలంలో అర్హులైన లబ్ధిదారులకు పక్కా గృహాలు మంజూరు చేయేందుకు అధికారులు సర్వే చేపట్టినట్టు ఎంపీడీవో కుమార్ తెలిపారు. పనికెర గ్రామంలో జరుగుతున్న సర్వేను పరిశీలించిన ఆయన, ఇంటి స్థల ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా, ఆధార్, రేషన్ కార్డు సిద్ధంగా ఉంచి సిబ్బందికి సహకరించాలని లబ్ధిదారులకు సూచించారు.