ATP: కణేకల్లు మండలంలోని SSMF ఫారంలోని వరి గడ్డిని వేలం వేయనున్నట్లు ఏడీఏ నారాయణ నాయక్ సోమవారం తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రం కార్యాలయంలో ఈ వేలం నిర్వహిస్తామన్నారు. వేలంలో పాల్గొదలచిన వారు అసిస్టెంట్ డైరెక్టర్, ఫారం SSMF సేల్ ప్రాసీడ్స్ పేరుపై లక్ష రూపాయలు డీడీ తీసి కార్యాలయంలో సమర్పించాలన్నారు.