NLR: సీతారాంపురం మండలంలో సోమవారం, పబ్బులేటి పల్లి గ్రామానికి చెందిన సచివాలయం లైన్ మెన్ మహిమలూరు వెంకటేశ్వర్లు (27) తోటి ఉద్యోగులతో కలిసి భోజనం చేస్తుండగా గుండెనొప్పితో బాధపడి, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అతని ఆకస్మిక మృతితో గ్రామస్తులు, సహోద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.