తూ.గో: జిల్లాలో 8,773 మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారని హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్(PD) నాతి బుజ్జి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం గృహప్రవేశాలు చేస్తారని చెప్పారు. అన్ని నియోజక వర్గాల పరిధిలో స్థానిక ప్రజా ప్రతినిధులు సమక్షంలో గృహప్రవేశాలు వేడుకగా నిర్వహిస్తామన్నారు. కామరాజుపేటలో జరిగే కార్యక్రమానికి కలెక్టర్ హాజరవుతారన్నారు.