VSP: డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా గర్భాన్ని తొలగించేందుకు వాడే మందులను అమ్ముతున్న మెడికల్ షాప్పై విశాఖ టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడులు చేశారు. సీపీ సూచనలతో గోపాలపట్నంలోని దర్విన్ ఫార్మసీపై మంగళవారం రాత్రి దాడులు చేయగా ఆరు కిట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. దుకాణంపై కేసు నమోదు చేసి మందులను డ్రగ్ కంట్రోలర్ అప్పగిస్తామని వెల్లడించారు.