AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ రెండో వార్డు బీసీ కాలనీలో ఆదివారం ఎంఈఓ 1 తలుపులు, ఎంఈఓ 2 నాగేంద్ర MPP మోడల్ పాఠశాల సిబ్బందితో కలిసి ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు తల్లిదండ్రులను కలిసి మోడల్ ఎంపీపీ పాఠశాలలో అందుతున్న విద్యా సౌకర్యాలను వివరించారు. ప్రాథమిక విద్యలో పాఠశాల పురోగతిని తెలుపుతూ పాఠశాలలో జాయిన్ చేయాలని కోరారు.