BPT: అద్దంకిలోని ప్రభుత్వ సంక్షేమ బాలుర హాస్టల్టును గురువారం రాత్రి జిల్లా అధికారి లక్ష్మీ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేసి ఆహారం ప్రతిరోజు ఎలా ఉంటుంది అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులందరూ మెరుగ్గా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.