ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత జన్మదినం సందర్భంగా టీడీపీ యువ నాయకుడు హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రాప్తాడు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ముగిశాయి. వారం రోజుల పాటు సాగిన ఈ టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొనగా, ఫైనల్లో ఇటుకలపల్లి జట్టు విజయం సాధించింది. విజేతలకు పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ తరఫున ప్రథమ బహుమతి రూ.50 వేలు అందజేశారు.