తిరుపతి నగరంలోని ఫుట్ పాత్లపై ఆక్రమణలను తొలగించాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం గరుడ సర్కిల్, రుయా సర్కిల్, జూ పార్క్ రోడ్లను పరిశీలించిన ఆమె తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని గుర్తించారు. అనంతరం జూ పార్క్ మార్గంలో వ్యర్థాలు పడేయడంతో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయని తెలిపారు.