కడప SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమం సాగుతోంది. శనివారం అర్ధరాత్రి తరువాత ప్రయాణించే లారీలు, బస్సులు, ఇతర వాహనాల డ్రైవర్లను ఆపి పోలీసులు నీళ్లతో ముఖం కడిగించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తతతో ఉండాలని పోలీసులు సూచించారు.