ప్రకాశం: యర్రగొండపాలెం మండలం మర్రివేముల గ్రామంలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం బిందెలతో ప్రజలు ఎగబడ్డారు. నీటి సమస్య ఉన్న ప్రాంతంలో ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్న తగినంత నీటి సరఫరా లేదని శనివారం స్థానిక ప్రజలు తెలిపారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో నీటి సమస్యను గుర్తించి తగినంత నీటిని సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.