ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిపారు. పెద్ద పండగలో మొదటిదైన భోగి మంటను ప్రిన్సిపాల్ డా కేబీకే నాయక్ ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెలుగుదనం ఉట్టిపడేలా ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్ధులు పంచెకట్టుతో కార్యక్రమంలో పాల్గొన్నారు.