KDP: ప్రభుత్వం చేసే అప్పులతోనే రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను పూర్తి చేయవచ్చని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం పులివెందులలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శాంతియుత నిరసన ర్యాలీలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.