E.G: గోకవరం మండలం మల్లవరంలోని 3 రేషన్ షాపులను గోకవరం తహశీల్దారు పినిశెట్టి రామకృష్ణ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ షాపుల ద్వారా నిత్యవసర వస్తువులు సక్రమంగా అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ డీలర్ వద్ద ఉన్న స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు.