KDP: ఎర్రగుంట్ల మండలంలో ఇల్లూరులోని పొలంలో ఉన్న విద్యుత్ మోటార్ల తీగల చోరీపై కేసు నమోదు చేసినట్లు సోమవారం కలమల్ల పోలీసులు తెలిపారు. మోపురి పెద్దదస్తగిరి రెడ్డి అనే రైతుకు సంబంధించిన దాదాపు రూ.15 వేల విలువ గల తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు వివరించారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.