SKLM: ఆమదాలవలసలో మంగళవారం సాయంత్రం పాల పోలమ్మ ఆలయ సన్నిధి, భవాని భక్తుల ఆధ్వర్యంలో అమ్మవారి తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ శోభ, భక్తి పారవశ్యంతో జరిగిన ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. మంగళ వాయిద్యాలతో వేడుక సందడిగా కొనసాగింది.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవని భక్తులు పాల్గొన్నారు.