NDL: ప్యాపిలి మండలం బురుగుల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు రామకృష్ణ రెడ్డి శనివారం మృతి చెందారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటానన్నారు.