NLR: నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 6వ డివిజన్ శెట్టిగుంట రోడ్డు ప్రాంతంలోని చేపల మార్కెట్‌ను బుధవారం సందర్శించారు. చేపల మార్కెట్ ప్రాంగణంలో వసతులను కమిషనర్ పరిశీలించి వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.