SKLM: శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ కూడలి సమీపంలోని నాగావళి నదిపై ఉన్న వంతెనపై గోతులు ఏర్పడ్డాయి. ఈ గుంతలు వలన ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. నిరంతరం రద్దీగా ఉండే వంతెనపై ఈ గుంతలు సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరతున్నారు.