కర్నూలు: సరైన సమయానికి జీతాలు చెల్లించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కర్నూలు జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. ప్రతినెల సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వారికి సరైన సమయంలో జీతాలు రావడం లేదన్నారు. బడ్జెట్ విడుదలైనప్పటికీ అధికారులు జీతం ఇంకా వేయలేదని వాపోయారు.