ప్రకాశం: భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో జరిగిన కౌశల్ 25 రాష్ట్రస్థాయి ప్రతిభా అన్వేషణ పోటీలలో పాపినేని పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని డి సమీరా జిల్లాస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది ఆమె రూ.1500 రూపాయల నగదు బహుమతితో పాటు, డిసెంబర్27న తిరుపతి సైన్స్ సెంటర్లో జరిగే రాష్ట్రస్థాయి కౌశల్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలకు ఎంపికైంది.