అన్నమయ్య: కేంద్ర క్రీడాశాఖ మంత్రి మాండవియా, సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేలను ఆంధ్రప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి రు.75 కోట్ల క్రీడా నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు, కాకినాడల్లో జాతీయ క్రీడా కేంద్రాలు, జిల్లాకు అదనపు ఖేలో ఇండియా కేంద్రాలు, రాయచోటిలో ఫుట్బాల్ మైదానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.