W.G: గృహ హింస, వరకట్న వేధింపుల కేసులో ఇరగవరం మండలం రేలంగికి చెందిన బాదంపూడి శ్రీనివాస్‌కు ఏడాది పాటు జైలు శిక్ష ఖరారు చేస్తూ, రూ.4,500ల జరిమాన విధిస్తున్నట్లు కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. 2021 మార్చిలో భార్య సునీత రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారు. దీనిపై విచారణలో న్యాయమూర్తి పీవీ నాగ రంజిత్ కుమార్ తుది తీర్పు ఇచ్చారు.